తారక్.. టాలీవుడ్ నెం.1

టాలీవుడ్ నెం.1 హీరో ఎవరు ? ఏమాత్రం తటపటాయించకుండా సమాధానం చెప్పలేని ప్రశ్న ఇది. నెం.1 అనిపించుకొనేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లకు అర్హత ఉందన్నది వారి వారి అభిమానుల అంచనా. అయితే, ఇప్పుడా అవకాశం వచ్చింది. ఈ దసరా – సంక్రాంతిలోపు ఈ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయ్. ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సీఫీస్ ని షేక్ చేసే స్టార్ టాలీవుడ్ నెం.1గా నిలిచే అవకాశం ఉంది.

ఈ దసరా కానుకగా ఎన్టీఆర్ ‘జై లవ కుశ’తో వస్తున్నాడు. తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తోన్న చిత్రమిది. ఈ తరం యంగ్ హీరోల్లో ఇంకెవ్వరు ట్రిపుల్ యాక్షన్ చేయలేదు. చేసే సాహాసం కూడా చెయ్యకపోవచ్చు. ఈ క్రమంలో టాలీవుడ్ నెం.1 అనిపించుకొనేందుకు తారక్ కి ఇదో అద్భుతమైన అవకాశం.

సూపర్ స్టార్ ఈ దసరాకి ‘స్పైడర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా దర్శకుడు మురగదాస్’కు కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు ఉంది. దాదాపు రూ. 120కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘స్పైడర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోలీవుడ్, బాలీవుడ్ లోనూ మహేష్ మార్కెట్ పెంచుకోబోతున్నాడు. పైగా స్పైడర్ తర్వాత నాలుగు నెలల గ్యాప్ లో మహేష్ – కొరటాలల ‘భరత్ అను నేను’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ నెం.1 అనిపించుకొనేందుకు మహేష్ కి ఇదో మంచి తరుణం.

క్రేజ్ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ నెం.1. దాన్ని ఎవరు కాదనలేని విషయం. అయితే, సినిమా లెక్కలు వేరు. పవన్ – త్రివిక్రమ్ సినిమా అంటేనా ఆ క్రేజీయే వేరు. టాలీవుడ్ కి రూ. 100కోట్ల దారిని చూపించిన పవన్-త్రివిక్రమ్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పవన్ టాలీవుడ్ నెం.1 గా అవతరిస్తాడేమో చూడాలి.


ఇక, మిగిలింది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. అయితే, ఆ సినిమా క్రెడిట్ లో ఎక్కువగా భాగం దర్శకధీరుడు రాజమౌళికి వెళ్లిపోయింది. ఇప్పుడు మరో సినిమాతో ప్రభాస్ నిరూపించుకోవాల్సి ఉంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రభాస్ సాహో వచ్చే యేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సో.. ఈ పోటీ నుంచి ప్రభాస్ ని ప్రక్కకు పెడదాం.

మిగిలిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్ టీఆర్ లలో టాలీవుడ్ నెం.1 అనిపించుకునేది ఎవరు ? ఆ అవకాశం ‘జై లవ కుశ ‘లో త్రిపాత్రాభినయం చేస్తోన్న తారక్ కి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. మరీ.. టాలీవుడ్ నెం. తారక్ నా ? మహేష్ నా.. ?? పవన్ నా.. ??? వేచి చూద్దాం.