సీఎం లోకేష్ కోసం మాస్టర్ ప్లాన్.. !
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్’ని ముఖ్యమంత్రి ప్రీఠంపై కూర్చోబెట్టేందుకు పక్కా ప్లాన్ రెడీ అయ్యిందా.. ? అంటే అవుననే అంటోంది ఎల్లో మీడియా. ఏపీ సీఎం చంద్రబాబుని రాజకీయ చాణుక్యుడిగా పిలుస్తుంటారు. ఇదీ నిజమే. దాదాపు 10యేళ్లు అధికారానికి దూరమైన సమయంలో, రాష్ట్ర విభజన సమయంలో ఆయన పార్టీని నడిపించిన విధానం అద్భుతం. అంతకంటే ఆయన తనయుడు లోకేష్’ని కార్యకర్తల పెద్ద దిక్కుగా పరిచయం చేస్తూ.. మంత్రిగా చేసిన బాబు మాస్టర్ ప్లాన్ మెచ్చుకోకుండా ఉండలేం.
ఇప్పుడు ఏకంగా లోకేష్ ని ఏపీ ముఖ్యమంత్రిని చేయడం కోసం పక్కా ప్రణాఌకని రెడీ చేసిన విషయం తెలిసిందే. గతంలో నెలకోసారి మీడియా ముందుకు వచ్చే లోకేష్.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తరచూ మీడియాతో టచ్ లో ఉంటున్నాడు. పార్టీ, ప్రభుత్వం నుంచి వచ్చిన క్రెడిట్ లో అధిక భాగం లోకేష్ ఖాతాలోకే వెలుతోంది. ఇక, వచ్చే ఎన్నికల ప్రచార బాధ్యతని లోకేష్ పై వేసి.. దాని ద్వారా వచ్చే ఫలితాన్ని పూర్తిగా లోకేష్ ఖాతాలో వేయాలని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2019లో మరోసారి టీడీపీ అధికారం చేజిక్కించుకొన్న తర్వాత ఓ మంచి ముహూర్తం చూసి.. లోకేష్ కి సీఎం పీఠం కట్టబెట్టాలని చంద్రబాబు ప్లాన్ అని చెప్పుకొంటున్నారు.
తనయుడిని సీఎం చేసిన చంద్రబాబు ఎన్డీయే కూటమిలో ఓ ప్రధాన పదవిని చేపట్టి.. మరోవైపు, టీడీపీ పార్టీ అధినేతగా కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.