గుత్తాకు సీరియస్ వార్నింగ్
నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై హైకోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచిన గుత్తా.. టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులను నియమించి వారికి మంత్రి హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) వేశారు.
ఈ అంశం ఈరోజు కోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. అయితే, ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ గుత్తా తరఫు న్యాయవాది హైకోర్టుని కోరారు. దీంతో ఎంపీ గుత్తా తీరుపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా వాడుకోవద్దని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
పిటిషన్ ఉపసంహరణకు అనుమతి నిరాకరించిన హైకోర్టు.. పిటిషనర్ వెనక్కి తగ్గినా విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఎంపీ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ తరుపున భారీ మెజారిటీతో గెలవాలని భావిస్తున్న గుత్తాకి కోర్టు వార్నింగ్ పెద్ద సమస్యగా మారబోతుంది.