అర్జున్ రెడ్డి హీరోయిన్ 100% లవ్
‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలిని పాండే కోసం దర్శక-నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టు ‘మహానటి’ కోసం షాలినీ తీసుకొన్నారు. ఇందులో ఆమెది జమున పాత్రని అంటున్నారు. తాజాగా, మరో బంపర్ ఆఫర్ ని కొట్టేసింది షాలినీ. సుకుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య – తమన్నా జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘100% లవ్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా ‘100% కాదల్’ టైటిల్ తో తమిళ్ రిమేక్ అవుతోంది.
ఈ చిత్రం కోసం ముందుగా తమన్నాని అనుకొన్నారు. ఆ తర్వాత ఆ అవకాశం లావణ్య త్రిపాఠికి దక్కింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ ఆ సినిమా నుంచి తప్పుకొంది. ఆమె స్థానంలో హెబ్బా పటేల్ పేరు పరిశీలనలోకి వచ్చింది. ఈ సమయంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో షాలినీ పాండే దూసుకురావడంతో .. 100% కాదల్ కోసం ఆమెని తీసుకొన్నట్టు సమాచారమ్.