దిల్ రాజుని మహేష్ ముంచాడు
మహేష్ సినిమా నిర్మాత దిల్ రాజుకి భారీ నష్టాలనే మిగిల్చేలా కనబడుతోంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మురగదాస్-మహేష్ బాబుల ‘స్పైడర్’ నైజాం రైట్స్ ని దిల్ రాజు రూ. 25కోట్లకి తీసుకొన్నారు. రిలీజ్ కి ముందు స్పైడర్ పై నెలకొన్న భారీ అంచనాల దృష్ట్యా నైజాంలో దిల్ రాజుకి లాభాల పండ పండటం ఖాయమనే ప్రచారం జరిగింది. తీరా స్పైడర్ ప్రేక్షకుల ముందుకొచ్చి మిక్సిడ్ టాక్ సొంతం చేసుకోవండం.. దసరా పోటీలో ఉన్న మరో రెండు సినిమాలు జై లవ కుశ, మహానుభావుడు సినిమాలు జోరుపించడంతో.. నైజాంలో స్పైడర్ హవా తగ్గింది.
ఇప్పటి వరకు నైజాంలో స్పైడర్ రూ. 10కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. ఈ వారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాలేదు కాబట్టి. స్పైడర్ ఖాతాలో మరో ఐదుకోట్లు చేరుతాయని భావించినా.. మిగిలిన రూ. 10కోట్ల మేర దిల్ రాజుకి నష్టాలు తప్పేలా లేవు. ఈ యేడాది వరుస హిట్స్ తో దిల్ రాజు భారీ లాభాలని ఆర్జించారు. శతమానం భవతి, డీజే, నేనే లోకల్ సినిమాలు పెద్ద మొత్తంలో లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ ఆనందంలో ఉండగానే.. మహేష్ దిల్ రాజుని ముంచాడని చెప్పుకొంటున్నారు.
అన్నట్టు వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహేష్ 25వ సినిమాని దిల్ రాజు, అశ్వినీదత్ తో కలిసి నిర్మించబోతున్న విషయం తెలిసిందే.