క‌థ కంచికేనా..

తెలుగు రాష్ట్రల్లో ఉత్కంఠ రేపుతున్న రేవంత్ ఎపిసోడ్ నేటితో తేలిపోనుంది. నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగిన టీటీడీపీ నేత‌లు, రేవంత్ కు మ‌ధ్య వ్య‌వ‌హారం క్లైమాక్స్ కు చేరింది. విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన ఏపీ సీఎం , టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు టీటీడీపీ నేత‌ల‌తో ఇవాళ స‌మావేశం అవుతున్నారు. రేవంత్ పై ఘాటుగా స్పందించిన మోత్కుప‌ల్లి, ర‌మ‌ణ‌లతో తాను చంద్ర‌బాబు వ‌ద్దే తేల్చుకుంటాన‌ని చెప్పిన రేవంత్ కు ఆ స‌మ‌యం వ‌చ్చేసింది. ఇప్ప‌టికే టీటీడీపీ నేత‌ల స‌మావేశానికి రేవంత్ కు కూడా ఫోన్ ద్వారా స‌మాచారం వ‌చ్చిన నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుంద‌నేది అంద‌రిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

కాంగ్రెస్ లో చేర‌డాన్ని రేవంత్ ఖండించ‌క‌పోవ‌డాన్ని చంద్ర‌బాబు ఎలా రియాక్ట‌వుతారు..పార్టీ నుంచి త‌ప్పిస్తారా.. చంద్ర‌బాబుకు రేవంత్ ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తారు.. అనే అంశాలు ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. గ‌త కొంత కాలంగా టీటీడీపీలో మొద‌లైన ముస‌లంను చంద్ర‌బాబు సెట్ చేస్తారా అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. స‌మావేశంలో అంద‌రినీ పిలిచి మాట్లాడ‌తారా, లేక రేవంత్ తో సెప‌రేట్ గా మాట్లాడ‌తారా అనేది కూడా ఒక చ‌ర్చ‌కు తావిస్తోంది. ఎవ‌రు ఏమ‌న్నా, ఏం చేసినా రేవంత్ మొండిగానే వెళ్ల‌డాన్ని చంద్ర‌బాబు ఎలా ప‌రిగ‌ణిస్తారు.. మొత్తంమీద ఈ రోజు జ‌రిగే టీటీడీపీ నేత‌ల స‌మావేశంలో చంద్ర‌బాబు రేవంత్ భ‌విత‌వ్యాన్ని తేల్చ‌నున్నారు. అయితే రేవంత్ పై ఎలాంటి యాక్ష‌న్ తీసుకుంటారు.. ఏం చేస్తార‌నేది తెలియాలంటే మాత్రం స‌మావేశం ముగిసే వ‌ర‌కు ఆగాల్సిందే..