మహేష్25 : న్యూయార్క్’లో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుత కొరటాల ‘భరత్ అను నేను’ షూటింగ్’లో బిజీగా ఉన్న మహేష్.. దీని తర్వాత వంశీ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. అయితే, ఇప్పటికే మహేష్ 25 సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. దర్శకుడు వంశీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్’లు కలిసి న్యూయార్క్ వెళ్లారు. అక్కడ మహేష్ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలెట్టేశారు.

ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ‘న్యూయార్క్ లో దర్శకుడు వంశీపైడిపల్లితో కలిసి మహేష్ 25వ సినిమాకి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి (In NEWYORK wit @directorvamshi composing 4 #MAHESH25 ! Amazing & Inspiring Script!! U wil all lov it) అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాని వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

ఈ సినిమా కోసం ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. మహేష్ 25 సినిమాని దిల్ రాజు, అశ్వినీదత్ లు కలిసి నిర్మించనున్నారు.