కాంగ్రెస్ తప్పు చేసిందా..
అసెంబ్లీ సమావేశాల ప్రారంభంరోజునే కాంగ్రెస్ ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడంపై ఒకవైపు అదికార పార్టీ విమర్శలు చేస్తూనే అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది. విపక్ష పార్టీ ఛలో అసెంబ్లీ వ్యూహమా తప్పిదమా అనే చర్చ జరుగుతోంది. మొదటిరోజే ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం వెనక ఉద్దేశమేంటో అనే ప్రశ్న అందరినీ వేధిస్తోందట. కాంగ్రెస్ తప్పుచేసిందని చాలామంది అనుకుంటున్నా.. ఆ పార్టీ మాత్రం వ్యూహాత్మకంగానే నిరసనకు పిలుపునిచ్చిందంటున్నారు కొందరు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనపుడు నిరసన తెలిపే కంటే ముందుగానే.. అదీ తొలిరోజే నిరసన కార్యక్రమం చేపడితే ఎక్కువ మైలేజీ ఉంటుందని ఆ పార్టీ భావించిదట.
జిల్లాల్లో ఎక్కడికక్కడ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వ నియంత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు , కాంగ్రెస్ పార్టీకి మైలేజీ పెంచుకునేందుకే ఛలో అసెంబ్లీ అని చెబుతున్నారు. ఒకవైపు పొలిటికల్ గేమ్ ప్లాన్ చేస్తూనే అసెంబ్లీ ముట్టడితో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోందట ఆ పార్టీ. అయితే అధికార పార్టీ మాత్రం కాంగ్రెస్ తీరును తప్పుబడుతోంది. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా ఇలా ముందుగానే నిరసనకు పిలుపునివ్వడమేంటని విమర్శిస్తున్నారు. చర్చించకుండా ఇలా చేయడం పారిపోవడమే అంటూ విమర్శిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం తాము తప్పు చేయలేదని, వ్యూహాత్మకంగానే వెళుతున్నామంటూ చెప్పుకుంటోంది… ఛలో అసెంబ్లీ ఎవరికి మైలేజ్ తెచ్చిపెడుతుందో చూడాలిమరి..