ఆసరాకే టోకరా..


కొన్నేళ్లుగా ఇలా గుట్టుచప్పుడు కాకుం డా జరుగుతున్న ఈ తంతును హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు రట్టుచేశారు. ఈ కేసులో మహ్మద్‌ అబ్దూల్‌ ఖాదర్‌, షేక్‌ షబ్బీర్‌ హుస్సేన్‌, అస్లాంలను శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఫలక్‌నుమా రాజన్‌బౌలి ప్రాంతానికి చెందిన చవాన్‌ ధశరథ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఆసరా మోసం వెలుగులోకి వచ్చింది. సీసీఎస్‌ అదనపు డీసీపీ జోగయ్య వివరాల ప్రకారం.. గతంలో విధులు నిర్వహించిన బండ్లగూడ తహసీల్దారు నకిలీ ఆసరా పింఛన్లు ఏరియేవడానికి మహ్మద్‌ అబ్దూల్‌ ఖాదర్‌, షేక్‌ షబ్బీర్‌ హుస్సేన్‌, అస్లాంలను నియమించారు. వారికి గతంలో ఆధార్‌ కేంద్రాల్లో పనిచేసిన అనుభవం ఉంది. 300లకు పైగా చిరునామాల ను సేకరించి. వారి పేరుతో నకిలీ ఆధార్‌ కార్డులను త యారు చేశారు. వాటితో బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచారు. ఈ క్రమంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లను నకిలీ ఆధార్‌ కార్డులను ఉపయోగించి వారు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారు. ఇలా ప్రభుత్వ సొమ్ము రూ.40లక్షలకు గండికొట్టారు.

రాజన్‌బౌలీకి చెందిన చవాన్‌ థశరథ్‌ తన ఖాతా ను ఆధార్‌ కార్డును లింక్‌ చేయడానికి బ్యాంక్‌కు వెళ్లాడు. తన ఆధార్‌ కార్డు నకలును అఽధికారులకు ఇచ్చాడు. బ్యాంకు అధికారులు అతని ఆధార్‌ నెంబ ర్‌ ఎంటర్‌ చేయడంతో గతంలోనే ఆధార్‌ ఇచ్చినట్టు దానిపై నెలనెలా ఆసరా పింఛన్‌ పొందుతున్నట్టు అధికారులు చెప్పడంతో విస్తుపోయాడు. ఈ విషయపై దశరథ్‌ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీఎస్‌, సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్‌ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు.

బండ్లగూడ తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన పింఛన్ల అవకతవకలపై కలెక్టర్‌ యోగితారాణా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వర కు రూ.40లక్షల పింఛన్ల సొమ్ము అక్రమార్కుల ఖాతాలోకి వెళ్లడంపై ఆమె వాపోయారు. తప్పుడు చిరునామాలు సృష్టించి మోసానికి పాల్పడుతుంటే మీరేమి చేస్తున్నారంటూ ఇన్‌చార్జి ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్‌ వేణుగోపాల్‌ను కలెక్టర్‌ మందలించారు. పింఛన్ల వడపోత కార్యక్రమాలు చేపట్టారు కదా? అనర్హులను ఎందుకు గుర్తించలేకపోయారని హెచ్చరించారు. ఘటనపై పూర్తి రి పోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నేడు మండల తహసీల్దార్లతో పింఛన్లపై యోగితారాణా సమావేశం నిర్వహించనున్నారు.