కొలువుల కొట్లాట య‌థాత‌థం..

కొంత కాలంగా కోర్టులో ఉన్న అమ‌రుల స్పూర్తియాత్ర అంశంపై ఇప్పుడు స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో ప‌ర్య‌ట‌న‌ను స‌వాల్ చేస్తూ వేసిన పిటిష‌న్ పై ఎట్ట‌కేల‌కు కోర్టు స్పందించి అనుమ‌తి ఇచ్చింద‌ని టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం స్ప‌ష్టం చేశారు. న‌ల్గొండ‌ సభకి కోర్టు అనుమతి ఇచ్చిందని, కొలువుల కొట్లాట సభ అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసిన కూడా జాప్యం చేసారని ఆయ‌న అన్నారు. సభ జరగకుండా పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారని, త‌మ‌ మీటింగ్ కి గ్రౌండ్-హాల్స్ ఇవ్వకుండ యజమానులని పోలీసులు బెదిరిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు.

ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి అన్యాయం చూడలేదంటూ ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నాడా…? లేడా అనిపిస్తుందని, 31న జరిగే కొలువుల కొట్లాట సభ యధాతథంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. కోర్ట్ సభకి అనుమతి ఇస్తుంది అని నమ్ముతున్నామ‌ని, సభకి నిరుద్యోగులు పెద్ద ఎత్హున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్టేడియం… lb స్టేడియం… సరూర్ నగర్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో అనుమతి ఇవ్వాలని కోర్ట్ ని కోరామ‌ని, తాము చెప్పిన గ్రౌండ్స్ కాకుండా గ్రేటర్ పరిధిలో సభ కి ఎక్కడ అనుమతి ఇచ్చిన సిద్ధమే అన్నారు. తెలంగాణలో ఎవరు సభలు పేడతమన్నా మావోయిస్టులు పెరుతో హోమ్ మినిస్టర్ అనుమతి నిరాకరించండం దురదృష్టకరమ‌న్నారు టీజేఏసీ నేత కోదండ‌రాం.. స‌భకు అనుమ‌తి వ‌చ్చి స‌జావుగా సాగుతుందో.. లేక ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో చూడాలి మ‌రి.