శివ‌బాలాజీ భార్య‌కు వేధింపులు..

బిగ్ బాస్ షోతో మ‌రింత పాపుల‌ర్ అయిన సినీ న‌టుడు శివ‌బాలాజీ తెలియ‌ని వారుండ‌రు. ఆయ‌న విజ‌యం కోసం అత‌ని భార్య మ‌ధుమిత ఎంత‌గా తాప‌త్ర‌య‌ప‌డ్డారో అంద‌రికీ తెలిసిందే. తాజాగా త‌న భార్య‌కు మెయిల్స్ ద్వారా వేధింపులు వ‌స్తున్నాయంటు సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఆయ‌న పిర్యాదు చేశార‌ట‌. గ‌త కొంత కాలంగా గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఆమెకు అశ్లీల‌, అంభ్యంత‌ర‌క‌ర‌మైన సందేశాలు పంపుతున్నార‌ట‌.

యూట్యూబ్ లో సైతం వీడియో్ లి ంక్ పై అస‌భ్యంగా కామెంట్స్ పెడుతున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శివ‌బాలాజీ పోలీసుల‌ను కోరార‌ట‌. ఇలాంటి కామెంట్స్ , పోస్ట్స్ తో చాలా ఇబ్బంది ప‌డుతున్నామంటూ త‌మ గోడును చెప్పుకున్నార‌ట‌. మూడు రోజుల క్రితం పోలీసుల‌కు పిర్యాదు చేసినా విష‌యం కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వేధింపుల‌కు పాల్ప‌డుతున్న నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నార‌ట‌.