పొత్తులపై గుసగుసలు..
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నేతల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఎన్నికల నాటికి జరిగే పరిణామాలపై ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇపుడు రేవంత్ ను కలిసిన నేతలంతా ముందు టీఆర్ఎస్ ను కలిసిన వారేనంటూ కొందరు నేతలు చెప్పుకొస్తున్నారు. ఎవరైనా టీఆర్ఎస్ లో చేరడానికే ప్రాధాన్యతనిస్తారని, కాదంటే టీడీపీలోనే ఉంటారంటూ జోస్యం చెబుతున్నారు.
ఏ రాజకీయ నేతకైనా ఒక పొలిటికల్ ప్లాట్ ఫాం కావాలని, టీడీపీకి ఫ్యూచర్ లేదు కాబట్టే కాంగ్రెస్ లోకి వెళుతున్నారని రేవంత్ ను ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పరిస్థితినిబట్టి టీడీపీతో పొత్తు ఉంటుందని చెబుతున్నారట. నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్నచోటనో, లేక ఎక్కడైనా గ్యాప్ ఉంటేనో టీడీపీని కలుపుకుని పోవడమా, లేక పొత్తు పెట్టుకోవడమా అని ఆలోచిస్తారంటూ టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారట. చూడాలి మరి ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో..