విమానం డోరు ఊడి ప‌డింది.

విమానం విహంగంలో ఉండ‌గానే అనుకోని ఘ‌ట‌న జ‌రిగింది. ఒక్కాసారిగా విమానం డోరు ఊడి కింద‌ప‌డింది. న‌మ్మ‌కం క‌ల‌గ‌క‌పోయినా ఇది ఎవ‌రికో వ‌చ్చిన క ల కాదు.. హైద‌రాబాద్ లో జ‌రిగిన వాస్త‌వ సంఘ‌ట‌న‌. తార్నాక డివిజ‌న్ లాలాపేట్ లో ప్ర‌మాద‌వశాత్తు పై నుంచి వెళుతున్న విమానం డోరు ఊడి ఓ భ‌వ‌నంపై ప‌డింది. దీంతో అక్క‌డి స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు.

అనుకోకుండా ఒక్క‌సారిగా జ‌రిగిన ఈ ప‌రిణామానికి స్థానికులంతా దూరంగా ప‌రుగెత్తారు. ఇళ్ల‌లో ఉన్న వారు విష‌యం తెలుసుకుని భ‌యంతో బిగుసుకు పోయారు. ప్ర‌మాదంలో ఎవ‌రికీ ఏమీ కాక‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. విమానం డోర్ ను లాలాగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.