రేవంత్ తో కాంగ్రెస్ లో చేరేది వీరే..

టీ టీడీపీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరుతున్న రేవంత్ తో పాటు పలువురు తెలంగాణ తెలుగుదేశం నాయకులు కూడా వెళుతున్నారు. రేవంత్ తో పాటు టీటీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే సీతక్క, వేం నరేందర్ రెడ్డి, విజయరమణారావు, బోడజనార్దన్ ఉన్నారు.  ఢిల్లీలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. అనంతరం రాహుల్,  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ల సమక్షంలో రేవంత్‌రెడ్డి పార్టీలో చేరనున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలోకి చేరే వారిలో..

సీహెచ్‌. విజయరమణరావు (మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి)
వేం నరేందర్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
బోడ జనార్ధన్‌ (మాజీ మంత్రి),
అరికల నర్సారెడ్డి (మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్‌ రూరల్‌)
కత్తెర గంగాధర్‌ (మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ)
దొమ్మతి సాంబయ్య (వరంగల్‌)
సోయం బాపురావు (మాజీ ఎమ్మెల్యే, బోథ్‌)

జి.సావిత్రమ్మ (మాజీ ఎమ్మెల్సీ, మహబూబాబాద్‌)
గంగాధర్‌గౌడ్‌ ( మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్‌)
మేడిపల్లి సత్యం (చొప్పదండి)
కె.భూపాల్‌రెడ్డి (నల్గొండ)
రవి శ్రీనివాస్‌రావు (కాగజ్‌నగర్‌)
రాజారాం యాదవ్‌ (ఆర్మూర్‌)

బట్టి జగపతి (మెదక్‌)
ఎం.కశ్యప్‌రెడ్డి (హుజూరాబాద్‌)
మద్దెల రవీందర్‌ (ధర్మపురి)
దనసరి అనసూయ (మాజీ ఎమ్మెల్యే, ములుగు),
బి.జ్ఞానేశ్వర్‌ (రాజేంద్రనగర్‌)
పొట్టి ఇల్లయ్య యాదవ్‌ (ఇబ్రహీంపట్నం)

సీహెచ్‌.సత్యనారాయణరెడ్డి (చేవెళ్ల)
మారెపల్లి సురేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌)
మంగి జైపాల్‌రెడ్డి ( రాజేంద్రనగర్‌)
గడిల శ్రీకాంత్‌ గౌడ్‌ (పటాన్‌చెరు)
ఆర్‌.ఎస్‌. ఉదయ్‌ సింహ,
సీహెచ్‌.మధుసూదన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం)

కొప్పుల నర్సింహారెడ్డి (ఎల్బీనగర్‌)
జి.రఘుకిరణ్‌ (హైదరాబాద్‌)
అలపతి విజయ్‌ బాబు
సాతు మల్లయ్య
సతిష్‌ మాదిగ
ఎం.జైపాల్‌
హరిసింగ్‌ నాయిక్‌,

బి.ఎల్లయ్య
దుర్గం భాస్కర్‌,
రంగు బాల్‌ లక్ష్మి
హరిప్రియ నాయిక్‌ (ఎల్లందు)
సుబ్బారెడ్డి ( ఎల్లారెడ్డి)
కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొందుర్‌)
శశికళ యాదవరెడ్డి (పటాన్‌చెరు)

తోటకూర జంగా యాదవ్‌
బిల్యా నాయిక్‌ (దేవరకొండ, నల్గొండ)
పాటెల్‌ రమేశ్‌రెడ్డి (సూర్యపేట)
చుక్కల ఉదయ్‌ చందర్‌ (మహబూబాబాద్‌)
చరకొండ వెంకటేశ్‌ (అచ్చంపేట)
పి.శ్రీనివాస్‌రెడ్డి (కొల్హాపూర్‌)
పొట్ల నాగేశ్వర్‌రావు (మాజీ ఎమ్మెల్సీ, ఖమ్మం)