ఎర్ర‌బెల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

రేవంత్ తో పాటు టీటీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన సీత‌క్క విష‌యంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లో చేర‌డానికంటే ముందు సీత‌క్క త‌న‌తో స‌మావేశమ‌య్యార‌ని, మాట్లాడార‌ని, టీఆర్ఎస్ లో చేర‌డానికి అన్నీ సిద్ధం చేసుకున్నార‌న్నారు. రేవంత్ రెడ్డి భార్య సోమ‌వారం రాత్రి సీత‌క్క ఇంటికెళ్ళి బ‌తిమాలార‌ని, కాళ్లుకూడా ప‌ట్టుకున్నార‌ని, అందుకే బ‌ల‌వంతంగా సీత‌క్క కాంగ్రెస్ లో చేరార‌ని వ్యాఖ్యానించార‌ట‌. అయినా ఆమె కాంగ్రెస్ లో ఇమ‌డ‌లేర‌ని, ఉండ‌లేర‌ని తిరిగి వ‌చ్చేస్తార‌ని ఎర్ర‌బెల్లి చెబుతున్నారు. దీంతో ఈ అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.