నిర్బంధంపై నిర‌స‌న‌..

టీజేఏసీ త‌ల‌పెట్టిన కొలువుల‌పై కొట్లాట స‌భ‌కు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంద‌ని ప్ర‌జా సంఘాలు ఆరోపిస్తున్నాయి. జేఏసీ ప్ర‌తీ యాక్టివీటిపై ప్ర‌భుత్వం నిఘాపెట్టింద‌ని కోదండ‌రాం స్ప‌ష్టం చేశారు. ఇందుకు నిర‌స‌న‌గా ఇప్ప‌టికే 24గంట‌ల దీక్ష‌ను ప్రారంభించారు ఆయ‌న‌. ప్ర‌భుత్వ నిరంకుశంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌కుండా, ప్ర‌శ్నిస్తున్న వారి హ‌క్కును కాల‌రాసేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని జీఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం విమ‌ర్శించారు.

కోదండ‌రాం , ఇత‌ర జేఏసీ నేత‌ల ప్ర‌భుత్వ నిర్బందాన్ని వ్య‌తిరేకిస్తూ జేఏసీ కి విద్యార్థి సంఘాలు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ వైఖ‌రినిర‌సిస్తూ నేడు ఓయూ, కేయూతో పాటు రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్శిటీల బంద్ కు పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వ వైఖ‌రిపై ముందు ముందు ఇంకా ఎలాంటి ప‌రిణామాలు, నిర‌స‌న‌లు వెల్లువెత్తుతాయో చూడాలి మ‌రి.