మొద‌ల‌వ‌నున్న ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు..

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు వాడివేడిగా జ‌రుగుతున్నాయి. అటు ఏపీలోనూ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించినా ఇప్ప‌టివ‌ర‌కు స్ప‌ష్ట‌మైన తేదీని ప్ర‌క‌టించ‌లేదు. తాజాగా ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 10తేదీ నుంచి నిర్వహించాల‌ని కేబినెట్ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. స‌భ ఎన్ని రోజులు జ‌ర‌గాలి అనే అంశంపై 10న బీఏసీ స‌మావేశంలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు.

ఆరోజున ఉద‌యం 9.45కు శాస‌న‌స‌భ‌, 10.30కి శాస‌న మండ‌లి స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ,పార్టీ స‌భ్యులు పాద‌యాత్ర నేప‌థ్యంలో అసెంబ్లీ స‌మావేశాల‌కు వైసీపీ దూరంగా ఉంటుంద‌ని ఇప్ప‌టికే ఆ పార్టీ నేత‌లు ప‌లుమార్లు స్ప‌ష్టం చేశారు. ఇక కేవ‌లం అధికార పార్టీ నేత‌లు మాత్ర‌మే స‌భ‌లో ఉంటారు కాబ‌ట్టి , స‌భ స‌జావుగా సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీంతో అసెంబ్లీ స‌మావేశాల ప‌నిదినాలు కూడా త‌క్కువ‌గానే ఉండే అవ‌కాశం ఉందంటున్నారు ఏపీ టీడీపీ శ్రేణులు.