ఏపీపీఎస్సీకి అదనపు అధికారం..
ఈనెల 10 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందట. ఇందులో పలు విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించి ఎలాంటి గందరగోళం లేకుండా ఈ బాద్యతలు చేపట్టేందుకు APPSCకి అదనపు అధికారం కల్పించే బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
జల వనరుల శాఖ బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు పొందేందుకు ఉన్న రుణ పరిమితిని తొలగించేందుకు చట్టాన్ని సవరించాల్సినవసరం ఉంది. ఇందుకోసం చట్ట సవరణ చేస్తూ బిల్లును ఏపీ ప్రభుత్వంప్రవేశపెట్టనుంది. దీంతో పాటు నాలా పన్ను మినహాయింపు బిల్లును సభలో ప్రవేశపెట్టడంతోపాటు విద్యార్థుల ఆత్మహత్యలు, పోలవరం నిర్మాణం, రైతు రుణాల మాఫీ, అమరావతి నిర్మాణం పై సభలో కీలకంగా చర్చించనున్నారు.