లోకల్ వివాదంలో బాబు మోహన్ !
వచ్చే సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు తమ స్థానాలని పదిలం చేసుకొనేందుకు ఇప్పటికే నుంచి ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ క్రమంలో కొన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో నాన్ లోకల్ కార్డు పడిపోయింది. ఈ లిస్టులో ప్రముఖ కమెడియన్, ఆందోల్ ఎమ్మెల్యే బాబు మోహన్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. నేను నాన్ లోకల్ కాదు మొర్రో అని ఎంత మొత్తుకొన్నా.. ఆయన మాటని ఎవ్వరు ఆలకించడం లేదని ఆయన వాపోతున్నారు.
బాబు మోహన్ లోకల్ వివాదం అసెంబ్లీ లాబీల్లోనూ వినబడింది. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మోహన్ బాబు మీడియాతో పిచ్చాపాటిగా ముచ్చటిస్తూ.. ఆందోల్ నియోజకవర్గంలో 24 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. అలాంటి నేను నాన్ లోకల్ ఎలాగైతా. అమెరికాలో నాలుగేళ్లు ఉంటేనే గ్రీన్ కార్డు ఇస్తారు. అలాంటిది 24 ఏళ్ళ నుంచి ఉంటున్నప్పుడు నేను నాన్ లోకల్ ఎలా అవుతానని ప్రశ్నించారు. గా.. ముచ్చటేదో ప్రజలని అడగాలె గానీ.. మీడియాని అడిగితే ఏమొస్తుంది.. న్యూసు తప్పు.
గత ఎన్నికల్లో సోనియాగాంధీ స్రచారం చేసిన ఊరిలోనే 80శాతం ఓట్లు సాధించా. నా నియోజకవర్గం మొత్తం సింగూరు జలాలు అందిస్తున్నా. ఈ జలాలతో 40 వేల ఎకరాలకు నీరు ఇస్తున్నా. మరో ఎనిమిది మండలాల్లో పది వేల ఎకరాలకు నీరు ఇచ్చే పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ తనని మరోసారి గెలిపిస్తాయనే ఆశాభావాన్ని కనబరుస్తున్నారు మోహన్ బాబు.