మ‌న‌సులో మాట చెప్పేసిన ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌

ఇటు నందీ అవార్డుల విష‌యంలోనూ, అటు త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై బాల‌య్య మ‌న‌సులో మాట చెప్పేశారు. త‌ను న‌టించిన లెజెండ్ సినిమాకు ఎక్కువ నంది అవార్డులు రావ‌డంపై ఆయ‌న సంతోషాన్నివ్య‌క్తం చేశారు. ప‌నిలోప‌నిగా నంది అవార్డులు గెలుచుకున్న వారంద‌రికీ అభినంద‌న‌లు చెప్పేశారు.గ‌తంలో కంటే ఈమూడేళ్ల‌కు ఇచ్చిన అవార్డుల విష‌యంలో ఎన్టీఆర్, ర‌ఘుప‌తి వెంక‌య్య‌, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి చ‌క్ర‌పాణి అవార్డుల ఎంపిక‌కు మంచి స్పంద‌న ల‌భించింద‌ని త‌న మ‌న‌సులో మాట చెప్పేశారు.

అంతే కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్ధితో పాటు తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి విష‌యంలో సంతృప్తిని వ్య‌క్తం చేశారట బాల‌య్య‌. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న స‌మ‌గ్ర నీటి విధానంతో హిందూపురంలో ఈ సారి చెరువుల‌న్నీ నిండాయ‌ని, వ‌ర్షాలు కూడా బాగా కుర‌వ‌డం శుభ‌ప‌రిణామ‌మంటూ మురిసిపోతున్నార‌ట‌. అనంత‌పురంలో ఉపాధి అవ‌కాశాల‌పై ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశార‌ట‌. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఉపాధి అవ‌కాశాలు మ‌రింత పెరుగాయ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. లేపాక్షి ఉత్స‌వాల విష‌యంలోనూ ఒక క్లారిటీ ఇచ్చేశారు ఆయ‌న‌. ఫిబ్ర‌వ‌రి 24,25 తేదీల్లో లేపాక్షి ఉత్స‌వాలు జ‌రుపుతామ‌ని చెబుతున్నారు. మొత్తానికి అసెంబ్లీ బ్రేక్ లో స‌ర‌దాగా త‌న మ‌న‌సులో ఉన్నవ‌న్నీ అంద‌రితో పంచుకున్నారు బాల‌య్య‌.