టీఆర్ఎస్ అలా చేస్తే 2019లో గెలుపు కాంగ్రెస్ దే..
ఏదో ఒక హాట్ టాపిక్ తో నిత్యం వార్తల్లో నిలిచే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. అసెంబ్లీ లాబీలో వచ్చే ఎన్నికల్లో పరిస్తితులపై తన అంచనా చెప్పేశారు. కాంగ్రెస్ , టీఆర్ఎస్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్ సిట్టింగుల్లో తొంబై మందికి సీట్లు ఇస్తే గెలుపు కాంగ్రెస్ దే అని ఆయన అన్నారు. అందులో ముప్పై మంది సిట్టింగుల ఓటమి ఖాయమని చెప్పేశారాయన.
తాను పార్టీ పెడతానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరడం నిజమే కానీ, తానేమీ డిమాండ్ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ లో ఎప్పుడ ఏమవుతుందో చెప్పలేమని, కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అవుతాడని అనుకుమన్నామా అంటూ చెప్పుకొచ్చారు. పనిలో పనిగా ఇటీవలే టీఆర్ఎస్ నుంచి టీడీపీలో చేరిన భూపాల్ రెడ్డి పై పరోక్షంగా విమర్శించారు. తాను స్పందించే స్థాయి భూపాల్ రెడ్డిది కాదని అన్నారు.
గుత్తా సుఖేందర్ రెడ్డినే నలభై వేల ఓట్లతో ఓడించానని, తనలాంటి వాడు ఓడిపోయిన చరిత్ర లేదని దీమా వ్యక్తం చేశారు. మెజారిటీ ల్లో తేడా రావొచ్చు కానీ గెలుపు ఖాయమని, రాజశేఖర్ రెడ్డి ఐదు వేల తో ఒకసారి, ఐదు లక్షల మెజారిటీ తో ఒకసారి గెలిచాడు,కానీ ఓడిపోలేదని గుర్తు చేశారు.