‘నంది అవార్డు’లు.. మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందా ?

ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం ఒకేసారి 2014, 2015, 2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ నంది అవార్డుల విషయంలో ఇండస్ట్రీ నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మెగా హీరోల సినిమాలకు ఒక్క నంది కూడా దక్కకపోవడంపై.. మెగా అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆ అసంతృప్తిని మెగా కాంపౌండ్ నిర్మాతగా ముద్రపడిన బన్నీవాసు ద్వారా బయటపడింది.

మెగా హీరోల సినిమాలకు ఒక్క నంది అవార్డు కూడా దక్కకపోవడంపై బన్నీవాసు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్టయిలీస్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీకి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ (రేసు గుర్రం, సరైనోడు) ఇచ్చారు. రామ్ చరణ్ నుంచి సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. అయినా.. మెగా హీరోల సినిమాలకి నంది దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెగా హీరోలే కాదు.. యంగ్ హీరోల సినిమాలకు నంది అవార్డుల విషయంలో అన్యాయం జరిగినట్టు ఫిల్మ్ నగర్ గుసగుసలు వినడుతున్నాయి. మరీ.. వీటికి ఏపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.