నంది అవార్డులపై మెగాస్టార్ మాట

ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను ‘నంది అవార్డు’ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితో నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య సినిమా పురస్కారాలను ప్రకటించింది. నంది అవార్డుల ప్రకటనతో ఇండస్ట్రీలో కొత్త కళ కనబడుతోంది. ఫిల్మ్ నగర్ లో నంది అవార్డుల ఎంపికపైనే ముచ్చట్లు వినబడుతున్నాయి.

2016 యేడదికి గానూ ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డుకు మెగాస్టార్ చిరంజీవి ఎంపిక అయ్యారు. దీనిపై మెగాస్టార్ స్పందించారు. “ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డుకు క‌మిటీ న‌న్ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓ గొప్ప వ్య‌క్తి పేరిట నెల‌కొల్పిన అవార్డు 2016 ఏడాదికి గాను న‌న్ను ఎంపిక చేసినందుకు ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి, జ్యూరికి నా కృత‌జ్ఞ‌త‌లు. అలాగే మిగ‌తా విజేత‌ల‌కు నా అభినంద‌న‌లు” తెలియజేశారు చిరు.