పద్మావతి ఎఫెక్ట్ : డిసెంబర్ 1న భారత్ బంద్

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, షాహీద్ కపూర్ ప్రధాన పాత్రల్లో ‘పద్మావతి’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.1303కి చెందిన పిరియాడిక్ డ్రామా ఇది. డిసెంబర్ 1న పద్మావతి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా రిలీజ్’ని ఆపేయాలనే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘పద్మావతి’ రిలీజ్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించినా.. సినిమా రిలీజ్ ని అడ్డుకొనేందుకు రాజ్ పుత్ కర్ణిసేన ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉంది.

చివరకు పద్మావతి రిలీజ్ కానున్న డిసెంబర్ 1న భారత బంద్ కు పిలుపునిచ్చింది కర్ణసేన. ఈ మేరకు రాజ్ పుత్ కర్ణి సేన నేత లోకేంద్ర సింగ్ కల్వి పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా కర్ణసేన సభ్యులు బెంగళూరులో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పద్మావతి సినిమా విడుదలని ఎలాగైనా అడ్డుకొంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కర్ణసేన డిసెంబర్ 1న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.

రిలీజ్ కు ముందే ‘పద్మావతి’ సినిమా వేడిని పుట్టిస్తోంది. ఇక, రిలీజ్ తర్వాత పద్మావతి థియేటర్స్ లో ఏ రేంజ్ లో కల్లోలం జరుగుతుందోనన్న ఆందోళన కనబడుతోంది.