మరో యంగ్ హీరోకి లైఫ్ ఇచ్చిన పవన్ !

ఇప్పటికే యంగ్ హీరో నితిన్’కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైఫ్ ఇచ్చాడని చెప్పుకొంటారు. వరుస ప్లాపుల్లో ఉన్న నితిన్’కు పవన్ సపోర్టు చేయడంతో ఆయన హిట్స్ బాటపడ్డాడు. నితిన్ ‘ఇష్క్’ సినిమా ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ సినిమాని పవన్ ఫ్యాన్స్ సొంత సినిమాల భావించారు. సినిమా కథ కూడా బాగుండటంతో ఇష్క్ సూపర్ హిట్టయ్యింది. అప్పటి వరకు ప్లాపుల్లోనూ నితిన్ హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు. ఆపై నితిన్ ప్రతి సినిమాకు పవన్ ఫ్యాన్స్ సపోర్టు లభించింది. ఇప్పుడు ఏకంగా నితిన్ సినిమాని పవన్ త్రివిక్రమ్ తో కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు యంగ్ హీరో శివబాలాజీకి పవన్ కళ్యాణ్ సపోర్టు చేస్తున్నట్టు కనబడుతోంది. ‘కాటమరాయుడు’ సినిమాలో పవన్ నలుగురు తమ్ముళ్లలో ఒకరిగా శివబాలాజీ ఒకటిడిగా నటించారు. అప్పటి నుంచి శివబాలాజీని పవన్ తమ్ముడిగానే భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఈ అభిమానంతోనే బిగ్ బాస్ సీజన్ – 1 విజేతని చేశాడు. ఇప్పుడు శివబాలాజీ తాజా చిత్రం ‘స్నేహమేరా జీవితం’ సినిమాకు పవన్ ఫ్యాన్స్ మద్దతు దిరికింది. ‘స్నేహమేరా జీవితం’ సినిమా పోస్టర్ కు పవన్ అభిమానులు హారతులు ఇస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మొత్తానికి.. నితిన్ తర్వాత పవన్ శివబాలాజీకి లైఫ్ ఇచ్చినట్టేనని ఇండస్ట్రీలో చెప్పుకొంటున్నారు.