టీడీపీ ఖాళీ.. కేసీఆర్ లక్ష్యం నెరవేరింది

తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోయేలా కనబడుతోంది. ఇటీవలే ఆ పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్’లో చేరిన సంగతి తెలిసిందే. పోతూ పోతూ రేవంత్ రెడ్డి టీ-టీడీపీని ఊడ్చేసినంత పని చేశాడు. ఇక, మిగిలిపోయిన ఒకరిద్దరు నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరేందులు జరుపుతున్నట్టు సమాచారమ్. ఈ లిస్టులో టీ-టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ పేరు కూడా వినబడుతుండటం విశేషం.

రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అన్నమనేని నర్సింగరావు, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేర్యాల రవీందర్‌రావు, మంథని నియోజకవర్గ ఇంచార్జ్ కర్రు నాగయ్య తదితరులు తమ అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొన్నారు. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్న గండ్ర సత్యనారాయణరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పంపించారు. ఈ లెక్కన వచ్చే సాధారణ ఎన్నికలలోపే టీ-టీడీపీ ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది.

అదే జరిగితే.. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యం సంపూర్ణం అయ్యేలా కనబడుతోంది. నాడు ఉద్యమ సమయంలో తెలంగాణలో టీడీపీని లేకుండా శపథం చేసిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే టీడీపీ అధ్యక్షుడిని, ఆ పార్టీ ఆంధ్ర నాయకులని తెలంగాణ నుంచి వెళ్లేలా చేయడంలో సఫీలీకృతం అయ్యారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఆ పార్టీకి నాయకత్వం లేకుండా అయ్యే పరిస్థితులు కనబడుతుంది. దీంతో.. కేసీఆర్ లక్ష్యం సంపూర్ణమవ్వనుందని చెప్పుకొంటున్నారు.