శ్రీదేవి కూతురు తొలి చిత్రం ‘ధడక్’ ఫస్ట్ లుక్ !

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి తెరంగేట్రంపై కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. జాహ్నవిని శ్రీదేవి-బోని కపూర్ దంపతులు పముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ చేతుల్లో పెట్టినట్టు వార్తలొచ్చాయి. ఆయన ఎంతో కసరత్తు చేసిన తర్వాత జాహ్నవి ఎంట్రీని ‘సైరాట్’ రిమేక్ ద్వారా ఇప్పిద్దామని నిర్ణయించారు.

తాజాగా, సైరాట్ రిమేక్ కు ‘ధడక్’ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను నిర్మాత క‌ర‌ణ్ జొహార్ పోస్ట్ చేశాడు. శశాంక్ కైతాన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ‘ధడక్’లో హీరోగా ఇషాన్ ఖ‌ట్ట‌ర్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జులై 6, 2018న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు క‌ర‌ణ్ తెలిపాడు.