కోహ్లీ రెస్ట్ రిక్వెస్ట్ ఎప్పుడు ?
రేపటి (నవంబర్ 16) నుంచి భారత్ – శ్రీలకం టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా.. తనకు రెస్ట్ అవసరమైనప్పుడు కచ్చితంగా బీసీసీఐని రిక్వెస్ట్ చేస్తానని తెలిపారు. బాగా ఆడే ఆటగాళ్లకి కచ్చితంగా రెస్ట్ అవసరం. ఈ నేపథ్యంలోనే మొదటి రెండు టెస్టులకి హార్థిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చాం. ప్రస్తుతం 20 నుంచి 25 మంది ఆటగాళ్లతో కూడిన స్ట్రాంగ్ కోర్ టీమ్ ఉందని. దీంతో ఆటగాళ్లు రెస్ట్ తీసుకోవడానికి వెసులుబాటు కలగుతుందని కోహ్లీ చెప్పాడు.
మరోవైపు, కోహ్లీ విశ్రాంతి విషయంలో రకరకాల పుకార్లు షికారు చేశాయి. డిసెంబర్ లో కోహ్లీ – అనుష్కల వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే కోహ్లీ రెస్ట్ కావాలని బిసీసీఐ ని కోరాడని చెప్పుకొన్నారు. ఇప్పుడేమో కోహ్లీ అలసిపోయినప్పుడు కచ్చితంగా రెస్ట్ తీసుకొంటానంటున్నాడు. ఇక, ఊపు మీదున్న టీమిండియా టెస్టుల్లోనూ శ్రీలంకని క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.