తెలంగాణ శాస‌న మండ‌లికి ల‌గ‌డ‌పాటి?

తెలంగాణ శాస‌న మండ‌లికి ల‌గ‌డ‌పాటి వ‌చ్చారు. తెలంగాణ వ‌స్తే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌న్న ల‌గ‌డ‌పాటి ఏకంగా శాస‌న‌మండ‌లికి రావ‌డ‌మేంట‌నుకుంటున్నారా. రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న ఆయ‌న వెళితే గిలితే ఏపీ మండ‌లికి వెళ్లాలిగానీ తెలంగాణ శాస‌మండ‌లికి రావ‌డ‌మేంటి. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత ఆయ‌న వార్త‌ల్లో క‌నిపించ‌డం కూడా త‌గ్గిపోయింది. కానీ ఆయ‌న ఎక్క‌డ‌కు వెళ్లినా హాట్ టాపిక్ గా మారుతోంది.

గ‌తంలో ల‌గ‌డ‌పాటి ఏపీ అసెంబ్లీకి వెళ్ల‌డంతో ఆయ‌న మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌నే చ‌ర్చ జ‌రిగింది. కేవ‌లం కొత్త అసెంబ్లీ భ‌వ‌నాన్ని చూడ‌టానికి మాత్రంమే వ‌చ్చాన‌ని చెప్పినా అంత‌ర్గ‌తంగా రాజ‌కీయాల‌పైనే చ‌ర్చ జ‌రిగిందనే వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఆయ‌న తెలంగాణ శాస‌న మండ‌లికి రావ‌డం చర్చ‌నీయాంశ‌మైంది. అయితే త్వ‌ర‌లో త‌న కొడ‌కు పెళ్లి ఉంద‌ని, పెళ్లికార్డు ఇవ్వ‌డానికే మండ‌లికి వ‌చ్చాన‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న ఇంట్లో శుభ‌కార్యానికి ఆహ్వనించ‌డానికే వ‌చ్చాను త‌ప్ప ఇందులో రాజ‌కీయ వివేష‌మేమీ లేద‌ని చెప్పేశార‌ట‌. ఏమైనా ల‌గ‌డ‌పాటి అక‌స్మాత్తుగా తెలంగాణ శాస‌న‌మండ‌లికి రావ‌డంపై కొద్దిసేపు చ‌ర్చ‌ల‌కు తావిచ్చింద‌ని చెప్పుకోవ‌చ్చు.