చిరు ట్రయల్.. ఫుల్ సక్సెస్ !

మెగా అభిమానులకి గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి ట్రయిల్ ఫుల్ సక్సెస్ అయ్యింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా ‘సైరా నర్సింహారెడ్డి’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 6 నుంచి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్’లో ఓ యాక్షన్ సీన్ ని తెరకెక్కించనున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి, తెల్లదొరలకి మధ్యన జరిగే పోరాట సన్నివేశం ఇది. ఈ ఫైట్ లో దాదాపు 200మంది విదేశీయులు పాల్గొనబోతున్నారు.

హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ డిజైన్ చేసిన ఈ ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉంటుందట. దాదాపు పది రోజుల పాటు ఈ యాక్షన్ ఏపీసోడ్ ని తెరకెక్కించబోతున్నారు. అయితే, నేరుగా సెట్స్ మీదకు వెళ్లకుండా.. యాక్షన్ సీన్ లో చిరు గెటప్ పై ఓ ట్రయల్ షూట్ చేశారట. ఆ టెస్ట్ షూట్ ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని , చిరు లుక్స్ దగ్గర్నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయని చెబుతున్నారు. ఇప్పుడీ న్యూస్ విని మెగా అభిమానులు ఖుషి అయిపోతున్నారు.