బన్నీ కొత్త బిజినెస్ మొదలెట్టాడు

సినీ స్టార్స్ సైడ్ బిజినెస్ లు చేయడం సాధారణమే. టాలీవుడ్’లో స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు సైడ్ బిజినెస్ లు నడుపుతూనే ఉన్నారు. ఇటీవలే హీరోయిన్స్ కూడా సైడ్ బిజినెస్ లు పెట్టేస్తున్నారు. వాటిని లాభాల్లో నడిపిస్తున్నారు కూడా. తాజాగా, స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త బిజినెస్ మొదలెట్టాడు. బీ-డబ్స్ అంటూ కొత్త బిజినెస్ వెంచర్ ను స్టార్ట్ చేస్తున్నాడు. హైద్రాబాద్ లోని జూబిలీ హిల్స్ లో ఈ స్పోర్ట్స్ బార్ ఓపెన్ అయ్యింది.

ఇదిలావుండగా.. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సీనియర్ దర్శకుడు లింగస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. తెలుగు, తమిళ్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.