సీఎం కేసీఆర్ మళ్లీ మాటతప్పారు
అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. పదహారు రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాలపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల విషయంలోనూ మాట తప్పారని విమర్శిస్తున్నారు. అసెంబ్లీ 50 రోజులు జరపుతామని మొదట్లో కేసీఆర్ చెప్పారని, కానీ పదహారు పని దినాలకే వాయిదా వేయటం దారుణమని బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతితో పాటు ఇంకా చాలా ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సి ఉందని, అయినా సభను నిరవధిక వాయిదా వేసుకున్నారని ఆయన విమర్శించారు.
ప్రజల తరపున అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసిందని, సభలో బీజేపీ నిర్మాణాత్మకంగా వ్యవహరించిందన్నారు. బీఏసీ మీటింగ్ పెట్టకుండా సభను వాయిదా వేయటం దురదృష్టకరమని అన్నారు. ఇచ్చిన మాట తప్పడం సీఎంకు అలవాటుగా మారింది.