మిలియన్ జాబితాలో కీర్తి సురేష్ !

యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ హవా చూపిస్తోంది. కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ లోనూ ఈ ముద్దుగుమ్మ హవా కొనసాగుతోంది. ‘నేను శైలజ’తో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ ప్రస్తుతం క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. ‘మహానటి’ సావిత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఝాతవాసి” సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది కీర్తి సురేష్. ఆమెకు సినిమా ఆఫర్స్ తో పాటు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది.

తాజాగా, కీర్తి సురేష్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. మిలియన్ మ్కార్ ఫాలో వర్స్ ని సంపాదించుకొన్న అతి తక్కువ మంది సినీ స్టార్స్ లిస్టులో ఈ యంగ్ హీరోయిన్ కూడా చేరిపోయింది. ఈ సందర్భంగా ‘నాలుగేళ్ళుగా న‌న్ను ఎంత‌గానో ఆద‌రిస్తూ వ‌స్తున్నారు. మ‌రెంతో ముందుకు సాగాల‌ని కోరుకుంటున్నాను. మ‌ద్దతుగా నిలిచిన వారంద‌రికి ధ‌న్య‌వాదాలు’ అంటూ కీర్తి ట్వీట్ చేసింది.