అలాగే కానివ్వండి
గత కొద్ది రోజులుగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార , విపక్షాలు పోటాపోటీగా సభలో మాట్లాడుతున్నారు. తొలిరోజు బీఏసీ సమావేశంలో సమావేశాలు ఎప్పటి వరకు జరగాలన్నదానిపై ఒక నిర్ణయానికి రాలేదు. సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ సభ ఎన్ని రోజులు జరుగుతుందో ఒక స్పష్టత కావాలని కోరడంతో అధికార పార్టీ ఆలోచనలో పడింది. 17వతేదీ వరకు సమావేశాలు జరుగుతాయని, తరువాత బీఏసీలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ యాభై రోజులు సభను నిర్వహిస్తామని చెప్పినప్పటికి , ప్రతి పక్షాలు ఎన్ని రోజులంటే అన్ని రోజులు సభను నిర్వహిస్తామని చెప్పారు. కానీ సభ జరుగుతున్నప్పటికీ . విపక్షాలు ఎన్నిరోజులు నిర్వహించాలనేది చెప్పకపోవడంతో మంత్రి హరీష్ రంగంలోకి దిగారు. జానారెడ్డి ఛాంబర్ లోకి వెళ్లి జీవన్ రెడ్డితో బేటీ అయ్యారు. బీజేపీ, టీడీపీ కూడా ఈ రోజుతో సభని ముగించేందుకు అంగీకరించడంతో ఈ రోజే అసెంబ్లీ ముగించే అవకాశంఉందట. ఇక బీఏసీ సమావేశం కూడా నిర్వహించకపోవచ్చని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.