చంద్రబాబును కలిసిన టీఆర్ఎస్ ఎంపీ
రాజకీయాల్లో నువ్వా, నేనా అంటూ తలపడుతుంటారు రాజకీయ నాయకులు. వ్యక్తిగతంగా మాత్రం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటుంటారు. అందులోనూ తమ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు ఆహ్వానించడంలో పార్టీలు, ఏపీ, తెలంగాణ అనే తేడాలుండవంటారు మనోళ్లు. కొద్ది రోజుల క్రితం ఏపీకి చెందిన పయ్యావుల కేశవ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యలతో పాటు సీఎం కేసీఆర్ ను తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు లగడపాటి రాజగోపాల్.
ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకుల వంతు వచ్చింది. అధికార టీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడి వివాహం నిశ్చయం కావడంతో ఏపీ నేతలను ఆహ్వానించడానికి వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబును కలిసి తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా కోరారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తోంటే రాష్ట్రలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసుందాం అనే మాట గుర్తొస్తుంది కదూ.. !