అభిమానులకు బన్నీ పార్టీ ఇచ్చాడోచ్.. !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకి సప్రైజ్ పార్టీ ఇచ్చాడు. బన్నీ కొత్త బిజినెస్ మొదలెట్టిన సంగతి తెలిసిందే. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత స్పోర్ట్స్ బార్ అయిన ‘బి-డ‌బ్స్’ ఫ్రాంచైజీలో భాగ‌స్వామిగా చేరాడు. హైద‌రాబాద్‌లో తొలిసారిగా ‘బి-డ‌బ్స్’ను ఏర్పాటు చేశాడు. హైద్రాబాద్’లోని జూబిలీ హిల్స్ లో ఈ స్పోర్ట్స్ బార్’ని శుక్రవారం బన్నీ స్వయంగా ఓపెన్ చేశాడు.

ఓపెనింగ్’కి బన్నీ వస్తున్నాడని ముందే తెలుసుకొన్న ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ‘బి-డ‌బ్స్’ ప్రారంభోత్సవం కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా కొందరు అభిమానులు బయట నిల్చొని ఉన్నారు. వారిని పిలిచి బన్నీ డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఇప్పుడు బన్నీ ఇచ్చిన పార్టీని గొప్పగా చెప్పుకొంటునారు.. ఆయన అభిమానులు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సీనియర్ దర్శకుడు లింగస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. తెలుగు, తమిళ్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.