పద్మావతి మెచ్చిన అమరావతి

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే లీడ్ రోల్ లో నటించిన భన్సాలీ ‘పద్మావతి’ విడుదలపై వివాదాలు తెలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 విడుదల కావాల్సిన ‘పద్మావతి’ సినిమాని వాయిదా వేశారు. ఈ ఏపీసోడ్’లో దర్శకుడు భన్సాలీ, హీరోయిన్ దీపికా పదుకొనెలని చంపుతామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది కాస్త భయాందోళనకి గురిచేసింది. చివరికి ‘పద్మావతి’ చిత్రబృందం కాస్త తగ్గి సినిమాని వాయిదా వేసుకొంది. లేదంటే పరిణామాలు ఎక్కడకు దారితీస్తుండేనే ఏమో.. !

పద్మావతి వివాదానికి తాత్కాలికంగా తెరపడటంతో పద్మావతి (దీపికా పదుకొనె) బయట కనబడుతోంది. ఈరోజు ఆమె ఏపీ రాజధాని అమరావతిలో సందడి చేసింది. విజయవాడలో ఏపీ పర్యాటక శాఖ నిర్వహించిన ‘సోషల్‌ మీడియా సమ్మిట్‌ 2017’లో దీపిక పాల్గొంది. టూరిజం మంత్రి అఖిల ప్రియ చేతుల మీదుగా దీపికకు సమ్మిట్ అవార్డును స్వీకరించింది.

ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. “అమరావతి ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ పచ్చదనం, పరిశుభ్రత తనను ఎంతో ఆకట్టుకున్నాయి” అన్నారామె. దీపిక రాక గురించి ముందే తెలుసుకొన్న ఆమె అభిమానులు భారీగా తరలివచ్చారు. దీపికా రాకతో హోరెత్తిపోయింది. ఈ విషయాన్ని దీపికా ప్రస్తావించింది. అమరావతిలో తనను చూసేందుకు ఇంత మంది అభిమానులు రావడం చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. మరోసారి అమరావతికి వస్తానని హామీ ఇచ్చింది.