హైకోర్టు పరిసరాల్లో ఆంక్ష‌లు..

హైకోర్టు పరిసరాల్లో రెండు నెలల పాటు అంక్షలు విధి స్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ, ఏపీ హైకోర్టుల ప్రధాన కార్యకలాపాలతో పాటు అడ్వకేట్లు, కోర్టు పనుల పై వచ్చే సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలిగించే విధంగా పరిసర ప్రాంతాల్లో పలు అంక్షలు విధించారు. ముఖ్యంగా హైకోర్టుకు ఉత్తర దిశలో సిటీ కాలేజీ జంక్షన్ నుంచి నయాపుల్ రోడ్ వరకుచ, దక్షిణ దిశలో మదీనా బిల్డింగ్ నుంచి సిటీ కాలేజీ వరకు ఆంక్ష‌లు అమ‌లులోకి వ‌స్తాయి.

నయాపుల్, మదీనా సర్కిల్, హైకోర్టు రోడ్డు వరకు పత్తర్గట్టి, మదీనా హైకోర్టు రోడ్డు, ముస్లింజంగ్ బ్రిడ్జి సర్కిల్ నుంచి హైకోర్టు రోడ్డు, పురానాపుల్ పీటీవో నుంచి సిటీకాలేజీ క్రాస్రోడ్స్, మూసాబౌలి, మెహంది, సిటీ కాలేజీ క్రాస్రోడ్స్, హైకోర్టు రోడ్ వరకు ఉన్న రోడ్లతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న వీధుల్లో వాటి పరిసరాల్లో అంక్షలు అమల్లో ఉంటాయి.

పోలీసు అధికారుల ఆంక్ష‌ల నేప‌థ్యంలో హైకోర్టు ప‌రిస‌ర ప్రాంతాల్లో ఎలాంటి పబ్లిక్ మీటింగులు నిర్వహించ‌కూడ‌దు. ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడవ‌ద్దు. ఎలాంటి ఆయుధాలు , బ్యాన‌ర్లు తీసుకెళ్ల‌కూడ‌దు. మొత్తంగా హైకోర్టు ప‌రిస‌ర ప్రాంతాల‌లో రెండు నెల‌ల వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి ఉంటుంది.