మోడీపై మహేష్ సటైర్లు పేల్చబోతున్నాడా ?

‘స్పైడర్’ తర్వత సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అను నేను” సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇదో పొలిటికల్ సటైర్. మరో ‘మెర్సెల్’ సినిమా కాబోతుందని ఫిల్మ్ నగర్ లో గుసగసలు వినబడుతున్నాయి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ ‘మెర్సెల్’ సినిమాలో మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నోట్ బ్యాన్, జీఎస్టీ పథకాలపై సటైర్స్ వేశారు. అవి కాస్త వివాదాలకు దారి తీశాయి. అయితే, వివాదాల్లోనూ కలెక్షన్స్ లో అదరగొట్టింది విజయ్ ‘మెర్సల్’.

ఇప్పుడు ‘భరత్ అను నేను’ సినిమాలోనూ మహేష్ పొలిటికల్ సటైర్స్ పేల్చబోతున్నాడట. ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వం, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వంపై పడనున్నట్టు చెప్పుకొంటున్నారు. ముఖ్యంగా దేశంలోని విద్యావ్యవస్థను మహేష్ ప్రశ్నించబోతున్నట్టు తెలుస్తోంది. ఇపుడున్న విద్యావ్య‌వ‌స్థ మ‌రీ క‌మ‌ర్షియ‌ల్‌గా మారింది. ఎల్‌కేజీ, యూకేజీల‌కే ల‌క్ష‌ల ఫీజులు వ‌సూలు చేస్తున్నారు. వీటిపై మహేష్ సటైర్లు వేయనున్నాడని చెబుతున్నారు. ఇదే నిజమైతే.. మహేష్ సినిమా మరో మెర్సల్ గా మారే అవకాశం ఉంది. అయినా… కమర్షియల్’గా ఢోకా ఉండదుగా.. ! అంటున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్.