నాగ్-వర్మ ‘కంపెనీ’ గురించి షాకింగ్ నిజాలు.. !

నాగార్జున – రామ్ గోపాల్ వర్మలు కలసి ఓ కంపెనీ పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఉదయమే ఆ ‘కంపెనీ’ని ప్రారంభించారు. ఇప్పుడీ కంపెనీ గురించి, ఆ కంపెనీలో జరిగే పనుల గురించి హాటు హాటుగా చర్చించుకొంటున్నారు. ఇంతకీ నాగ్-వర్మ కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసా.. ?

దాదాపు 28 యేళ్ల తర్వాత నాగ-వర్మలు కలిసి చేస్తోన్న చిత్రమిది. అందుకు తగ్గట్టుగా సినిమాకు ‘కంపెనీ’ టైటిల్ ని పెట్టి సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడీ కంపెనీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలయ్యింది. గ్యాంగ్ స్టర్, మాఫియా కథలని ఎక్కువగా ఇష్టపడే వర్మ.. కంపెనీని దానికి లింకు చేసినట్టుగా కనబడుతోంది. ఫస్ట్ లుక్ లోనే చేతిలో డబ్బు, గన్ను పట్టుకొని కనిపించాడు. దీంతో.. ఆయనది గ్యాంగ్ స్టర్ పాత్రనా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇదీగాక, పెద్దోడిని దోచి.. పేదోడికి పెట్టేసే టైపు.. ఓ యాక్షన్ సినిమా అయి ఉంటుందనే చర్చ సాగుతోంది. మొత్తానికి.. నాగ్-వర్మ కంపెనీ విషయంలో ఎనో సందేహాలు కలుగుతున్నాయి. అవెప్పుడు తీరుతాయన్నది చూడాలి.