శబరిమల ఆలయంలోకి మహిళ..

శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ ప్ర‌వేశం మరోసారి వివాదంగా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి 31ఏళ్ల వయసున్న ఓ మహిళ ప్రవేశించేందుకు ప్ర‌యత్నించారు. ఆలయం ముందున్న పదునెట్టాంపడిని ఎక్కేందుకు ఆ మహిళ యత్నించగా, అధికారులు గుర్తించి ఆమెను అడ్డుకున్నారు. పోలీసులు ఆ మ‌హిళ‌ను వెన‌క్కి పంపించారు. ఆమెను ఆంధ్రప్రదేశ్ కు చెందిన‌ మహిళగా గుర్తించారు. ‘నైస్తిక బ్రహ్మచర్యం’ సంప్రదాయం ప్రకారం 10-50ఏళ్ల వయసున్న స్త్రీలెవరికీ ఆలయంలోకి ప్రవేశం లేదు. ఆమె వద్ద ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా వయసును గుర్తించి అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.

‘పదినెట్టాంపడిని ఎక్కుతుండగా ఓ మహిళను అడ్డుకున్నా మ‌ని, ఆమె వద్ద ఉన్న గుర్తింపు కార్డు ప్రకారం ఆమె వయసు 31 సంవత్సరాలని నిర్ధారణకు వచ్చామ‌ని పోలీసులు చెబుతున్నారు.ఆ మహిళ తన కుటుంబ సభ్యులతో వచ్చినట్లు గుర్తించారు. సాధారణంగా శబరిమలకు వచ్చే మహిళల గుర్తింపుకార్డులను తనిఖీ చేసి, అనంతరం కొండపైకి పంపుతారు. కానీ, ఆ మహిళ పదునెట్టాంపడి వరకూ ఎలా వచ్చిందో తెలియరాలేదంటున్నారు అక్క‌డి అధికారులు