బుమ్రా ‘సిక్స్ ప్యాక్’ తీశాడు
టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజుల్లోనే తనని నిరూపించుకొన్నాడు. టీమిండియా సిరీస్’లు గెలవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే న్యూజిలాండ్ తో వన్డే, టీ20 సిరీస్ లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. డెత్ ఓవర్లలో తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేయడం బూమ్రా పధానం బలం.
ఈ పేసర్ కెప్టెన్ కోహ్లీ సూచన మేరకు ఫిట్ నెస్ పై ఫోకస్ చేశాడు. ఈ మధ్య ఫిట్ నెస్ కోసం ఎక్కువ సమయాన్ని కెటాయిస్తున్నాడు. తాజాగా, సిక్స్ ప్యాక్ బాడీని కూడా డెవలెప్ చేశాడు ఈ యువ బౌలర్. తన సిక్స్ ప్యాక్ ఫోటోని బుమ్రా ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘మనకు మనమే నిరంతరం మెరుగవ్వాలంటే అంకిత భావం, కష్టపడడం అవసరం’ అని వ్యాఖ్య పెట్టాడు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.