ఆపదలో దీపికా పదుకొనె కుటుంబం !
హాలీవుడ్’లోనూ రాణిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే కుటుంబ సభ్యులు ఆపదలో ఉన్నట్టు తెలుస్తోంది. దీపికా లీడ్ రోల్’లో నటించిన భన్సాలీ “పద్మావతి” సినిమా చుట్టూ వివాదాలు అలుముకొన్న సంగతి తెలిసిందే. రాజ్ పుత్ కర్ణసేన హెచ్చరికల నేపథ్యంలో డిసెంబర్ 1న విడుదల కావాల్సిన ‘పద్మావతి’ వాయిదా పడింది. అయినా.. కర్ణసేన చేసిన హెచ్చరికలు పద్మావతి చిత్రబృందానికి నిద్రలేకుండా చేస్తున్నాయి.
దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, ‘#పద్మావతి’గా నటించిన దీపికా పదుకొనెలను చంపేస్తామని కర్ణసేన తీవ్ర హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు ప్రభుత్వం దీపికతో పాటుగా, బెంగళూరులో ఉంటున్న ఆమె కుటుంబ సభ్యులకు భద్రత ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరులోని జేసీ నగర్లో ఉన్న దీపిక ఇంటికి పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం సైడ్ నుంచి భద్రత ఏర్పాటు చేసినా దీపిక కుటుంబం భయభయంగా బతుకుతుందట. దీపిక తండ్రి ప్రకాశ్ పదుకొణె కూడా ధైర్ఘ్యాన్ని కోల్పోయినట్టు చెబుతున్నారు. పద్మావతి రిలీజ్ వాయిదా పడటంతో తాత్కాలికంగా సమస్య తీవ్రత తగ్గినా… ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అన్న భయంతో దీపిక కుటుంబం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, దీపికా మాత్రం ఎప్పటిలాగే తన పనుల్లో మునిగిపోయింది. ఇటీవలే ఏపీ రాజధాని అమరావతికి వచ్చే అవార్డుకు కూడా స్వీకరించి వెళ్లిన సంగతి తెలిసిందే.