రామోజీరావుతో కోమటిరెడ్డి భేటీ
కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం చేసినా హాట్ టాపిక్’గా మారుతోంది. ఆయన ఎలాంటి కామెంట్స్ చేసినా చర్చనీయాంశంగా మారిపోతాయి. సాధారణంగానే వారు ఏం చేసినా అందులో ఏదో ఉందని చర్చ జరుగుతుంది. పార్టీలో ఉంటూ సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు. కొద్దిరోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీ లేదని వారు స్పష్టం చేయడంతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
అయితే, ఆయన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోమటి వెంకట్ రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే చిరుమర్తి తో కలిసి ఈ రోజు రామోజీ రావును కలిశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు ఇరవై నిముషాలు రామోజీరావుతో కోమటిరెడ్డి ఏకాంతంగా భేటి అయ్యారు. వీరిద్దరి భేటిపై రాజకీయ విశ్లేషకులు రకరకాల కారణాలను అంచాన వేస్తున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం భేటీకి రాజకీయ ప్రాధాన్యమేమీ లేదని, వ్యక్తిగతంగా ఆయన్ను ఒకసారి చూసి వెళ్లడానికే వచ్చానని చెబుతున్నారట.