లోకేష్’ని ఢీకొట్టిన పోసాని

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇవి నంది అవార్డులు కావు కాపు, సైకిల్ అవార్డులని విమర్శలు చేస్తున్నారు.ఇండస్ట్రీ నుచి ఈ రేంజ్’లో అసంతృప్తిని ఎక్స్ పెక్ట్ చేయని చంద్రబాబు ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. ఇలాంటి వివాదాలకు దారితీస్తుందని తెలిస్తే ఐవీఆర్ఎస్ ద్వారా నంది అవార్డులని ఇచ్చేవాళ్లమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

ఈ ఏపీసోడ్’పై తొలిసారి స్పందించిన మంత్రి లోకేష్ చిక్కుల్లో పడ్డాడు. ఏపీలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేని వారు నంది అవార్డులపై ఆరోపణలు చేస్తున్నారని కామెంట్ చేశారు. దీనిపై నటుడు పోసాని కృష్ణమురళీ తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణలో మీకు ఇళ్లు, వ్యాపారాలు లేవా? లోకేష్ కు ఉన్న మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే మమ్మల్ని తరిమికొట్టేవారు. ఏపీ ప్రజలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ తిట్టలేదు. ఏపీ రాజకీయ నేతలను మాత్రమే తిట్టారని గుర్తు చేశారు. ‘తనకు ప్రకటించిన నంది అవార్డును తిరస్కరిస్తున్నా. చంద్రబాబు చెప్పినట్టుగా ఐవీఆర్ఎస్ ద్వారా నంది అవార్డులు ఇస్తే అప్పుడు తీసుకొంటా’ అంటున్నారు.