ఐదుగురితో యవ్వారం నడిపిందట
హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ హీరోయిన్’గా నిలదొక్కులేకపోయింది. దీంతో.. ఐటమ్ సాంగ్స్’కు కెరాఫ్ అడ్రస్ గా మారింది. అయితే, ఈ ముద్దుగుమ్మ ఎఫైర్లు నడపటంలో దిట్ట అని చెబుతుంటారు. ఈ విషయాన్ని రామ్ లక్ష్మీ అంగీకరించింది. ఇప్పటి వరకు తానూ ఐదుగురితో ఎఫైర్ నడిపినట్టు అంగీకరించింది. వీరందరితోనూ విడిపోయి.. ఇప్పుడు సింగిల్ గా ఉంటున్నా. ప్రేమ కథలు విఫలం కావడంలో తన పాత్ర కూడా ఉందని ఒప్పేసుకొంది. కాగా, ఈ ముద్దుగుమ్మ టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని తోనూ ఎపైర్ నడిపినట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
రాయ్ లక్ష్మీ నటించిన బాలీవుడ్ చిత్రం ‘జూలీ 2’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆమె ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్స్ ని చూస్తే సినిమాలో లక్ష్మీరాయ్ దాదాపు అన్నీ చూపించబోతుందనే విషయం అర్థమవుతోంది. ఇక, ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రాయ్ లక్ష్మీ తనకి పడకగది పిలుపు వచ్చాయని తెలిపింది. ఇప్పుడు స్వయంగా తన లవ్ ఎఫైర్స్ గురించి ఓపెన్ గా చెప్పేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు ఇంకెన్ని విషయాలు బయటపెడుతుందో చూడాలి.