ఆర్టీసీలో భ‌ర్తీ చేసే పోస్టులు ఇవే..!

తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగాలు భ‌ర్తీ చేసే విష‌యంపై దృష్టి సారించింది. ఎన్నిక‌ల హామీ మేర‌కు వీలైనంత త్వ‌ర‌గా ఉద్యోగాల నియామ‌కాలు చేప‌ట్టాల‌ని భావిస్తోంది. ఇందులో భాగంగా టీఎస్ ఆర్టీసీలో కొన్ని పోస్టుల భ‌ర్తీ చేసే అంశంపై ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఖాళీగా ఉన్న 279 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది.

టీఎస్పీఎస్సీ ద్వారా ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌నిఇ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మొత్తం 279 పోస్టుల్లో 72 జూనియర్ అసిస్టెంట్, 123 మెకానికల్ సూపర్ వైజర్ ట్రెయినీ, 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీసీలో ఉద్యోగాలు పొందాల‌నుకునే వారికి నిజంగా ఇది శుభ‌వార్తే క‌దా..!