కంగనాకు మళ్లీ గాయాలు

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ షూటింగ్’లో మరోసారి గాయపడింది. ఆమె తాజా చిత్రం “మణికర్ణి”. ఝాన్సీ లక్ష్మీబాయ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. క్రిష్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జోధ్‌పూర్‌లో జరుగుతోంది. సినిమాలోని ఓ సన్నివేశం కోసం స్టంట్‌ చేస్తుండగా ఆమె కాలికి గాయమైయింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

కంగన కుడి కాలు బెణికింది. ఆమెకు చికిత్స చేశాం. కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోమని సూచించామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో “మణికర్ణి” షూటింగ్’కు మరోసారి బ్రేక్ పడనుంది. ఈ సినిమా షూటింగ్’లో కంగనకు గాయాలు కావడం ఇది రెండోసారి. కొద్దిరోజుల క్రితం ఇదే సినిమా షూటింగ్’లో కంగనా తలకు గాయమైన సంగతి తెలిసిందే. మణికర్ణిక సినిమాని తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తోంది కంగనా.