రాఘవేంద్ర రావు.. ఓ చిన్ని కోరిక
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఓ చిన్న కోరికని తీర్చుకోబోతున్నాడట. దర్శకుడిగా ఆయన అనుభవం గురించి తెలిసిందే. అన్నిరకాల సినిమాలతో… అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించిన దర్శకుడాయన. కొంతకాలంగా దర్శకేంద్రుడు భక్తిరస సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన తీసిన “ఓం నమో వెంకతేశాయ” హిట్ టాక్ తెచ్చుకొన్న కమర్షియల్ గా ప్లాపుగా నిలిచింది. వాస్తవానికి ఇదే ఆయన ఆఖరి చిత్రం అని ప్రచారం జరిగింది. అయితే, ఫ్లాపుతో ఇన్నింగ్స్ ని ముగించడం రాఘవేంద్రరావుకి ఏమాత్రం ఇష్టం లేదు.
ఈ నేపథ్యంలోనే ఆయన ఓ చిన్ని సినిమాని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు సమాచారమ్. ఓ యంగ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం కథ ఎంపిక చేయడంలో రాఘవేంద్ర రావు బిజీగా ఉన్నారు. అన్నీ కుదిరితే.. వచ్చే యేడాది ప్రథమార్థంలో రాఘవేంద్ర రావు సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పుకొంటున్నారు. దర్శకేంద్రుడి ఈ చిన్ని కోరికని తీర్చబోయే హీరో-హీరోయిన్ ఎవరు ? అనేది చూడాలి.