వైరల్ : ఐటమ్’కు చిరు ముద్దులు

మెగాస్టార్ చిరంజీవి ఐటమ్ భామ రాయ్ లక్ష్మీకి ముద్దులు పెట్టడంపై ఇండస్ట్రీలో హాట్ హాట్’గా చర్చించుకొంటున్నారు. రాయ్ లక్ష్మీ నటించిన బాలీవుడ్ చిత్రం “జూలీ2” ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆమెకు సడెన్ సర్’ప్రైజ్ ఇచ్చారు. ఆమె చిరు ఓ వీడియా పంపించారు. అందులో జూలీ 2 రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

”ఇది నీకు ప్రత్యేకమైన సినిమా అని… ఎందుకంటే ఇది నీ కెరీర్ లో 50వ సినిమా అని చెప్పారు. వివిధ భాషల్లో నటిస్తూ, అభిమానులను మెప్పిస్తున్న నిన్ను చూసి చాలా సంతోషిస్తున్నా. నీ టాలెంట్ ను, నీలో ఉన్న సత్తాను ‘జూలీ 2’ చూపిస్తుందని ఆశిస్తున్నా. “వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్… గుడ్ లక్ టు ‘జూలీ 2′” అంటూ చివర్లో ఫ్లయింగ్ కిస్ విసిరారు. మెగాస్టార్ 150వ చిత్రం ‘ఖైదీ నెం. 150’ సినిమాలో రాయ్ లక్ష్మీ ఐటమ్ సాంగ్ లో నటించింది. ఆ సమయంలో రాయ్ లక్ష్మీ టాలెంట్ ని చూసిన మెగాస్టార్.. ఆమెకు విషెస్ చెప్పి ప్రోత్సహిస్తున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులని తన బుట్టలో పడేసింది రాయ్ లక్ష్మీ. జూలీ 2 ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లో రాయ్ లక్ష్మీ అందాలని చూసి బాలీవుడ్ జనాలు ఫిదా అయిపోతున్నారు. ఇదీగాక, జూలీ 2 ఓ ప్రముఖ నటి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందనే ప్రచారం జరుగుతోంది. జూలీ 2 ప్రముఖ సీనియర్ హీరోయిన్ నగ్మా కథనే అని చెప్పుకొంటున్నారు. ఇదే నిజమైతే.. జూలీ 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడం గ్యారెంటీ అని చెప్పుకొంటున్నారు.